ATP: గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల 6న అనంతపురం జేఎన్టీయూ స్నాతకోత్సవానికి రానున్న నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. వర్సిటీలోని గెస్ట్ హౌస్, ఆడిటోరియం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేదిక భద్రతను అధికారులు తనిఖీ చేయాలని, విద్యార్థులకు పాసుల పంపిణీలో జాగ్రత్త వహించాలన్నారు.