ELR: ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి పెంచేందుకు అధికారులు పనితీరు మెరుగుపరచాలని మంత్రి మనోహర్ సూచించారు. ఏలూరు కలెక్టరేట్ సమీక్షలో ప్రతి 15 రోజులకు పురోగతి కనిపించాలని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు.