NLG: నకిరేకల్ పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయ నూతన చైర్మన్గా కందాల సత్తిరెడ్డి, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి పాలకమండలి సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు.