BHNG: ఆలేరు మున్సిపల్ పరిధిలోని పోచమ్మగుడి వద్ద 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని శనివారం మున్సిపల్ ఛైర్మన్ బీజన బాలమణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శారాజిపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి హైమావతి, కౌన్సిలర్లు సంపత్, నీరజాసిద్ధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.