KMR: జుక్కల్ మండలం మైబాపూర్కు చెందిన కోమలికి పురిటి నొప్పులు రావడంతో జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు బాన్సువాడకు రిఫర్ చేశారు. దీంతో 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. స్పందించిన సిబ్బంది సమయస్ఫూర్తితో కాన్పు చేశారు. అనంతరం సిబ్బందికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.