యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అసాధారణ ప్రతిభ కలిగిన క్రికెటర్ అని యువరాజ్ కొనియాడాడు. అతడి బ్యాట్ స్వింగ్ తన కంటే చాలా మెరుగ్గా ఉంటుందని అన్నాడు. ఇలాంటి బ్యాటింగ్ వేగాన్ని తాను చాలా తక్కువ మందిలో చూశానని పేర్కొన్నాడు. వైభవ్‌కు స్టేడియం నలుమూలలా షాట్లు ఆడే సత్తా ఉందని ప్రశంసించాడు.