MDK: నర్సాపూర్ పట్టణంలోని ఓ గార్డెన్లో రేపు ఆదివారం ఉదయం 9:30 గంటలకు రెండో విడత జాబ్ మేళా జరగనుంది. నియోజకవర్గ నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కోరారు. అర్హులైన అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో హాజరై ఈ ఉపాధి అవకాశాలను పొందాలని ఆయన సూచించారు.