MDK: ప్రభుత్వ ఉపాధ్యాయురాలి బీసీ-ఈ కుల ధ్రువీకరణ పత్రం, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ను రద్దు చేస్తూ మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బీసీ-ఈ కుల ధ్రువీకరణ పత్రంతో టీచర్ ఉద్యోగం పొందిన నేపథ్యంలో ఉద్యోగం దక్కని మరో అభ్యర్థి ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ ఆధారంగా కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నారు.