అన్నమయ్య: ములకలచెరువు మండలంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఉచ్చువారిపల్లికి చెందిన నందిని(15) అనే బాలిక దుస్తులు ఉతికేందుకు గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందింది. బి.కొత్తకోటలో 9వ తరగతి చదువుతున్న నందిని ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా చెరువులో మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.