NRPT: ధన్వాడ మండల కేంద్రంలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతినెల పింఛను పోస్టల్ అధికారులు సక్రమంగా చెల్లించడం లేదని నిరసిస్తూ శనివారం మహబూబ్ నగర్- నారాయణపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గత వారం రోజుల్లో లబ్ధిదారులు రాస్తారోకో చేయడం ఇది రెండోసారి కావడం విశేషం. ఎస్సై వెంకటేష్ గౌడ్ పోస్టల్ అధికారులకు పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు.