BHNG: ఆలేరు మండలంలో గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఉపాధి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.