BHPL: ప్రజా పాలనలో ప్రగతి రథసారథి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి సీతక్క అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు నాసిరెడ్డి సాంబశివరెడ్డి హాజరైనారు.