TG: కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియను జాగృతి అధ్యక్షురాలు కవిత వేగవంతం చేశారు. పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై జాగృతి నేతలతో ఆమె చర్చలు జరిపారు. ఈనెల 25న పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. సభకు వచ్చేవారికి వసతి, కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.