NLG: పౌర్ణమి తిథిని పురస్కరించుకుని నార్కట్ పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం మాస కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణతంతులో పలువురు దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.