CTR: పూతలపట్టు(M) ఎర్రచెరువుపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో టమాటా లారీ బోల్తా పడింది. గుర్రంకొండ నుంచి చిత్తూరు వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా లారీ టైరు పగిలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీలోని టమాటా లోడ్ మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.