KKD: తుని మండలం వెలమ కొత్తూరు జడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే యనమల దివ్య విద్యార్ధులకు అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజనం పధకంపై సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డించిన ఆమె అనంతరం అంగన్వాడీ కార్యకర్తలతో ముచ్చటించారు. పాఠశాల మౌలిక సమస్యలపై టీచర్లను అడిగి తెలుసుకున్నారు.