KKD: రైతు అభ్యన్నతితో పాటు వారి భూములకు పూర్తి రక్షణ కల్పన కోసమే రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రూపొందించడం జరిగిందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తుని మండలం నందివంపులో తహసీల్దార్ గిడుతూరి ప్రసాదరావు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యనమల దివ్య హాజరైయ్యారు. ఇక్కడ 185 మంది రైతులకు డిజిటల్ పాసు పుస్తకాలను అందజేశారు.