TG: చేనేత సహకార సంఘానికి ఇచ్చిన ఆర్డర్‌ను సర్కార్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ప్రజా ప్రభుత్వమా.. లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా? అని మండిపడ్డారు. టెస్కోకు ఆర్డర్లను రద్దు చేసి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కార్మికుల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు. ఆర్డర్‌ను వెనక్కి తీసుకోవడం వెనుక మతలబు ఏంటి? అని నిలదీశారు.