CTR: చిత్తూరులో మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.40,000 జరిమానా విధించారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.