గద్వాల జిల్లాలో పదో తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాలలోని సరస్వతి ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థుల హాల్ టికెట్లలోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించాలని సూచించారు.