PDPL: ధర్మారం మండలం శాయంపేటలో ఇవాళ పశువులకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ శ్రీవాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరైన సమయంలో సరియైన పోషణ పద్ధతులు పాటించి, మంచి లాభాలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.