నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో మండల ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన కొడవలూరు మండలంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీస్లో అధికారులతో సమావేశం అయ్యారు. మండల పరిధిలోని పలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరిస్తామన్నారు.