కర్నూలు: కోసిగి రైలులో ప్రయాణిస్తున్న ఓ బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. తుముకూరుకు చెందిన శివప్ప, యల్లమ్మ దంపతుల రెండో కుమారుడు రమేష్ (14) ఇవాళ బెంగళూరు నుంచి తిరిగి వెళ్తుండగా నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. కోసిగి రైల్వే స్టేషన్ చేరుకునే సమయానికి ఛాతి నొప్పి అంటూ అపస్మారక స్థితిలో పడిపోయిన రమేష్ అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.