ఖమ్మం నగరంలోని టేకులపల్లి దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో ఉన్న మామిడి తోట కాయల వేలాన్ని ఈనెల 6న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్ఫేర్ అధికారి వేల్పుల విజేత తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 4వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని ఆమె కోరారు. వేలంలో పాల్గొనేవారు నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.