MDK: ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో గ్రామసభల ద్వారా విజయవంతం చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానందం పిలుపునిచ్చారు. చిలిపిచెడ్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, ప్రజల భాగస్వామ్యంతో ఈ సభలను జయప్రదం చేయాలని సూచించారు.