VZM: శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై డీఎస్పీ వివేకానంద బుధవారం వివరాలు వెల్లడించారు. ఎస్కోటకు చెందిన నిందితుడు వెంకటరమణ బాలికను వైజాగ్ సుజాతనగర్‌కు తీసుకెళ్లి తన అపార్ట్మెంట్లో అత్యాచారం చేసి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి బాలిక తల్లిదండ్రులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.