WGL: GWMC 14వ డివిజన్ పరిధి ఏనుమాములకు చెందిన BJP, RSS, విశ్వహిందూ పరిషత్ నాయకులు బుధవారం స్థానిక వరంగల్ తహసీల్దార్‌ను కలిశారు. ఎనుమాములలో కబ్జాకు గురైన శివాలయం స్థలాన్ని పరిరక్షించాలని వారు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి, విచారణ జరిపి, స్థలాన్ని రక్షించాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.