పెద్దపల్లి మండలం రాగినేడులో ముస్లింలు మతసామరస్యం చాటుకున్నారు. హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు, భక్తులకు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా గ్రామ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో అల్పాహారం, పండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. గ్రామంలో అన్ని మతాల ప్రజల మధ్య ఐకమత్యం, సోదర భావం ఉండాలని ఈ సందర్భంగా వారు కోరుకున్నారు. ముస్లింలకు హనుమాన్ భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.