GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు సబ్స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన 5MVA ట్రాన్స్ఫార్మర్ను తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో విద్యుత్ సరఫరా సామర్థ్యం గణనీయంగా పెరిగి, ప్రాంతంలో ఉన్న లోడింగ్ సమస్యలు తగ్గుతాయని తెలిపారు.