GDWL: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంతో పాటు తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజావాణికి కూడా వివిధ భూ సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇస్తున్నారని, మండల స్థాయిలోనే రెవెన్యూ అధికారులు వివిధ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు.