KKD: పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏప్రిల్ 4 నుంచి పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ కె. మాణిక్యరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 22 వరకు.. ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు తరగతులు జరుగుతాయన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.