BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో MPDO, MRO కార్యాలయాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఈ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజులు పనుల్లో జాప్యం ఏర్పడినప్పటికీ ఇటీవల పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు.