సరుకు రవాణా విభాగంలో దక్షిణ మధ్య రైల్వే జోన్కు భారీగా ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 147.87మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా సుమారు రూ.13,835 కోట్ల ఆదాయం వచ్చింది. జోన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాదే.. రికార్డు ఆదాయం నమోదైంది. ఈ జోన్ సరుకు రవాణా విభాగంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల, స్థూల ఆదాయంలో విజయాన్ని నమోదు చేసిందని అధికారులు చెప్పారు.