TG: రేపు హైదరాబాద్ సిటీ హనుమాన్ నామస్మరణతో మార్మోగనుంది. శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 11.30లకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమై.. రాత్రి 8 గంటలకు తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. దీంతో తాడ్బండ్, ఈఎస్ఐఎల్, ఏఎస్ రావు నగర్, సైనిక్ పురి, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.