NGKL: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కమ్యూనిస్టు పార్టీలకు, మావోయిస్టులకు మధ్య ఉన్న తేడా తెలియని పరిస్థితి నెలకొందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు బుల్లెట్‌ను నమ్మలేదని బ్యాలెట్‌ను నమ్మిందని అన్నారు.