SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఎమ్మెల్యే అని విర్రవీగవద్దు.. దమ్ముంటే బీరంగూడ గుట్టపైకి రావాలి, అక్కడ నీ అవినీతి చిట్టా విప్పుతా” అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో హరీష్ రావు తీరుపై కూడా విమర్శలు చేశారు. నీ సంగతి చూస్తానంటూ ఎమ్మెల్యేకు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఈ సవాల్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.