AP: ఆంధ్రుల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవం. గత పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం ఇది. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది మైలురాయి. ప్రపంచపటంలో అమరావతిని నిలుపుతాం. కేంద్రం, మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు. మద్దతు ఇచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు’ అని తెలిపారు.