BPT: అమరావతికి చట్టబద్ధత లభించడంపై బాపట్లలో హర్షం వ్యక్తమైంది. బుధవారం 11వ వార్డు ఇందిరా నగర్లో సంబరాలు జరిగాయి. నారా భువనేశ్వరి, అంజనా దేవి చిత్రపటాలకు స్థానిక మహిళలు పాలాభిషేకం చేశారు. రాజధాని ఉద్యమంలో మహిళల త్యాగాలను వారు కొనియాడారు. అమరావతిని శాశ్వత రాజధానిగా నిలపడంలో ఎంపీ కృష్ణప్రసాద్ కృషి మరువలేనిదని యల్లమంద ప్రశంసించారు.