ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షన్-2026 కార్యక్రమంలో భాగంగా హోమ్ కంపోస్టింగ్పై శిక్షణ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆదేశాల మేరకు మెప్మా ఆర్పిలకు ఈ శిక్షణ ఇచ్చారు. ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తతో సహజ ఎరువు తయారీ విధానాన్ని వివరించారు. 20 లీటర్ల బకెట్లో సేంద్రీయ వ్యర్థాలను పొరలుగా వేస్తే 60 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుందన్నారు.