VSP: భీమిలి సమీపంలోని దాకమర్రి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు, ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బైక్పై ముగ్గురు ప్రయాణిస్తుండగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.