MBNR: మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆనందరావు బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు తన సహచర న్యాయవాదులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. న్యాయవాదుల ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు అనంతరెడ్డి పాల్గొన్నారు.