TG: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థుల కోసం 21 వస్తువులతో కూడిన భారీ స్కూల్ కిట్‌ను సిద్ధం చేస్తోంది. ఆ కిట్‌లో మూడు జతల యూనిఫామ్ క్లాత్, షూస్, రెండు జతల సాక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, టై, నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, షార్ప్‌నర్, జామెట్రీ బాక్స్, డిక్షనరీ వంటి అత్యవసర వస్తువులు ఉండనున్నాయి.