MHBD: తొర్రూరు ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ ఎంపీడీవో, తహసీల్దార్ అధ్యక్షతన అధికారులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులైన జీపీవోలకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని కోరారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.