PPM: జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు పొలాల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏనుగులను కవ్వించడం, వాటిపై రాళ్లు వేయడం వంటి పనులు చేయకూడదని హెచ్చరించారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని కోరారు.