కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్నుల వసూళ్లలో విశేష విజయాన్ని సాధించిందని కమిషనర్ వి.నిర్మల్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 31, 2026 నాటికి మున్సిపాలిటీలో మొత్తం 80.52% పన్నులు వసూలయ్యాయని, ఇది జిల్లాలోని రామచంద్రపురం, ముమ్మిడివరం మున్సిపాలిటీల కంటే మెరుగైన ఫలితమని ఆయన పేర్కొన్నారు.