ATP: శింగనమల మండల కేంద్రంలోని రామాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకులు, బండారు లీలావతి, సీతారామ స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.