KRNL: దేవనకొండ మండలంలో క్రికెట్ బెట్టింగ్, బెల్ట్ షాపులు, మట్కా వంటి అక్రమాలు జరుగుతున్నట్లు సీఐ వేణుగోపాల్ ఇవాళ తెలిపారు. వీటిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారని పేర్కొన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తప్పుదారి పట్టకుండా భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు.