KDP: చాపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా మధుసూదన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన జిల్లా ప్రజా పరిషత్తు నందు అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేస్తూ పదోన్నతిపై రెగ్యులర్ MPDOగా చాపాడులో నియమించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా వేసవిలో గ్రామాలలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామన్నారు.