AP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేసే వరకు ప్రభుత్వంపై తాము చేస్తున్న ఒత్తిడి కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 4న వైసీపీ శ్రేణులు రాష్ట్రంలోని దేవాలయాలలో పూజలు చేయనున్నారు. ఆయనతో రాజీనామా ఎందుకు చేయించడం లేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.