పల్నాడు: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఆర్డీవో బాలకృష్ణ హెచ్చరించారు. రంపిచర్ల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు సేవలు సక్రమంగా అందించాలని సూచించారు. ఎటువంటి ఫిర్యాదులు రాకుండా పని చేయాలని అధికారులకు తెలిపారు. పనితీరులో లోపాలు ఉంటే సహించబోమన్నారు.